క్యూ3లో రూ. 442 కోట్లు
రాణించిన జిందాల్ స్టీల్ జిందాల్ స్టెయిన్లెస్ (జేఎస్‌ఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో నికర లాభం దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 442 కోట్లకు చేరింది. 2021 ఇదే కాలంలో కేవలం కంపెనీ నికర లాభం రూ. 170 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ. 3,592 కోట్ల నుంచి రూ. 5,682 కోట్లకు పెరిగింది. రూ. 3,500 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.