For Money

Business News

పాలసీదారులకు 5 % డిస్కౌంట్‌?

పబ్లిక్‌ ఆఫర్‌కు ఎల్‌ఐసీ సన్నద్ధమతోంది. ఈ వారంలోనే సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను ఎల్‌ఐసీ దాఖలు చేయనుంది. కంపెనీ ప్రస్తుత విలువ రూ. 5.4 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి పబ్లిక్‌ ఆఫర్‌లో కొంత భాగాన్ని పాలసీదారులకు కేటాయిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఇది వరకే ప్రకటించింది. తాజా సమాచారం మేరకు పాలసీదారులకు ఎల్‌ఐసీ షేర్‌ ధరలో 5 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కంపెనీలో 5 శాతం నుంచి 7 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశముందని తెలుస్తోంది. ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన తరవాత వాస్తవంగా ఎంత వాటా విక్రయిస్తారో తెలుస్తుంది. ఈ ఆఫర్‌ నుంచి రూ, 65,000 కోట్ల నుంచి రూ. 75,000 కోట్లు సమీకరించే అవకాశముంది.