NIFTY TRADE: 17610 దాటకపోతే…

క్యాష్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిఫ్టికి 50 రోజుల ఎక్స్‌పొనెన్షనల్ మూవింగ్ యావరేజ్ (DEMA) 17,575- 17,610 మధ్య ఉందని, ఇదే దాటేంత వరకు నిఫ్టిలో బలం రాకపోవచ్చని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. ఈ స్థాయి దాటే వరకు కొనుగోళ్ళ జోలికి వెళ్ళొద్దని అంటున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు తగ్గిపోతున్నాయని, ఎస్బీఐ రిజల్ట్స్ కూడా వచ్చేయడంతో…మార్కెట్‌కు పాజిటివ్ ట్రిగ్గర్స్ లేవని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టి పడితే 17453, 17417 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. పెరిగితే 17575, 17610 వద్ద గట్టి ప్రతిఘటన ఉందని అంటున్నారు. నిఫ్టి క్షీణించేందుకే అవకాశాలు అధికంగా ఉన్నాయని అయన భావిస్తున్నారు. ఇతర డేటా, లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=V4BuliH6-Cs