NIFTY TODAY: 17440 కీలకం
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్ కాగా,ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి.వారం రోజుల తరవాత ప్రారంభమైన చైనా మార్కెట్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి నష్టాల్లో ఉన్నా… నామ మాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి ఒకవేళ పడితే ఎక్కడ మద్దతు లభింవచ్చు. ఎస్‌బీఐ ఇవాళ చాలా బలంగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టిని ఈ షేర్ గ్రీన్‌లోకి తెస్తుందా అన్నది చూడాలి. డే ట్రేడింగ్ కోసం నిఫ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17619
రెండో ప్రతిఘటన 17593
తొలి ప్రతిఘటన 17576
నిఫ్టికి కీలక స్థాయి 17532
తొలి మద్దతు 17456
రెండో మద్దతు 17440
డౌన్ బ్రేకౌట్ 17414
నిఫ్టి పడితే తొలి మద్దతు స్థాయిలో నిలబడుతుందేమో చూడండి. లేదంటే రెండో స్థాయి. కాని 17400 స్థాయి నిఫ్టికి కీలకం ఈ స్థాయి దిగువకు వస్తే అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నికల్‌గా నిఫ్టి ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉంది. సూచీలు సెల్ సిగ్నల్ ఇస్తున్నా… నిఫ్టికి వెంటనే మద్దతు లభిస్తుందేమో చూడండి.