థియేటర్లలో ఇక 100 శాతం కెపాసిటీ
కర్ణాటకలోని సినిమా థియేటర్లలో ఇక వంద శాతం సీట్ల కెపాసిటీకి అనుమతించనున్నారు. రాష్ట్ర టెక్నికల్ అడ్వయిజరీ కమిటీతో భేటీ అయ్యాక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం బసవరాజ్ కూడా పాల్గొన్నారు. శనివారం నుంచి సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్ అనుమతిస్తున్నామని అన్నారు. సినిమా థియేటర్స్ పాటు జిమ్‌లు, యోగా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ను కూడా 50 శాతం కెపాసిటీతో అనుమతిస్తున్నారు.