For Money

Business News

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌కు షాక్‌

డీబీ రియాల్టితో డీల్‌ కుదుర్చుకోవడం గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇన్వెస్టర్లకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. బ్రోకింగ్‌ సంస్థలు కూడా ఈ డీల్‌కు రెడ్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. నిన్న పది శాతం క్షీణించి… 7 శాతం నష్టంతో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ముగిసింది. ఇవాళ కూడా పది శాతం క్షీణించి రూ. 1501ను తాకింది. తరరాత కోలుకుని 7 శాతం నష్టంతో అంటే రూ. 118 నష్టంతో రూ. 1549 వద్ద ట్రేడవుతోంది. డెలివరీ వ్యాల్యూమ్‌ కేవలం 22 శాతమే ఉంది. అంటే చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్‌ను అమ్మేస్తున్నారని తెలుస్తోంది. ఇక డీబీ రియాల్టి షేర్‌ ధర మాత్రం పెరుగుతోంది. నిన్న అప్పర్‌ సీలింగ్‌ తాకిన ఈ షేర్‌ ఇవాళ కూడా అప్పర్‌ సీలింగ్‌ 5 శాతం లాభంతో రూ. 100.15 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ ధర వద్ద ఇంకా 42 లక్షల షేర్లకు డిమాండ్‌ ఉంది. డీబీ రియాల్టి గత ఏడాది ఏప్రిల్‌ 28న రూ. 16.75 వద్ద ఉండేది. 9 నెలల్లో ఈ షేర్‌ భారీగా పెరిగింది.