For Money

Business News

ఎల్‌ఐసీ ప్రస్తుత విలువ రూ.5 లక్షల కోట్లు!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) సహజసిద్ధమైన విలువను రూ .5 లక్షల కోట్ల( 6,680 కోట్ల డాలర్లు) కంటే ఎక్కువగానే ఉంటుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్ ) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు . ఇక ఎంటర్ప్రైజ్ విలువ దానికి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందని అన్నారు. రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించింది . ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ ఎంబెడెడ్‌ అంటే సహజసిద్ధమైన విలువకు నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఐసీలో కొద్ది వాటాను విక్రయించడం ద్వారా 120 కోట్ల డాలర్ల (రూ .90,000 కోట్లు) వరకు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు పూడ్చుకోవాలని భావిస్తోంది. వచ్చే వారంలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ పత్రాలను ఎల్‌ఐసీ సమర్పించనుంది. ఈ పత్రాల్లో దీనికి సంబంధించిన మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుంది. ఎల్ఐసీ లిస్టింగ్ అయ్యాక మార్కెట్ విలువ పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద అయిదు కంపెనీల జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి.