200 పాయింట్లకు పైగా క్షీణించిన నిఫ్టి
నాలుగు రోజుల ర్యాలీ తరవాత మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడంతో ఉదయం నుంచి ఒత్తిడి కన్పించింది. ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరిగితే, ఫలితాలు బాగా లేని కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇవాళ ఒకదశలో 17781 స్థాయిని దాటిన నిఫ్టి తరవాత 17700 స్థాయిని చాలా సులభంగా కోల్పోయింది. 17511 స్థాయిని తాకిన తరవాత.. 219 పాయింట్ల నష్టంతో 17560 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం, ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉండటంతో… దిగువ స్థాయిలో మద్దతు అందలేదు. సూచీల పరంగా చూస్తే…నిఫ్టి, ఫైనాన్షియల్ నిఫ్టీలు భారీగా క్షీణించాయి. మిడ్ క్యాప్ కూడా బాగానే పడింది. నిఫ్టి నెక్ట్స్ మాత్రం అర శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ ఆటో షేర్లు వెలుగులో ఉన్నాయి. ఫలితాలు బాగా లేకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ 3.5 శాతం క్షీణించింది.