ట్యాక్స్ రిటర్న్‌లో ఇక క్రిప్టో కాలమ్ ఉంటుంది
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఒక కాలమ్‌ను పొందుపరుస్తున్నారు. దీంతో ఎవరైనా క్రిప్టో ట్రేడింగ్ చేసుంటు వాటి వివరాలు కూడా చూపించాల్సి ఉంటుంది. ఇకపై క్రిప్టో ఆదాయాన్నీ ఐటీఆర్‌లలో పేర్కొనాలని, పన్నులు చెల్లించాల్సిందేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై గరిష్ఠంగా 30 శాతం పన్ను ఉంటుందని, క్రయవిక్రయాలపై 1 శాతం టీడీఎస్ కూడా పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. క్రిప్టో ఆస్తులకు సంబంధించిన చెల్లింపులు ఏడాదికి రూ.10,000 దాటితే 1 శాతం టీడీఎస్ ఉంటుంది. క్రిప్టోకరెన్సీల ద్వారా పొందే ఆదాయం రూ.50 లక్షలు దాటితే 30 శాతం పన్ను, 15 శాతం సెస్సు, సర్‌చార్జీలు పడతాయి. ఏప్రిల్ 1 నుంచి 30 శాతం పన్ను, జూలై 1 నుంచి 1 శాతం టీడీఎస్ ఉంటుంది.