For Money

Business News

స్థిరంగా ట్రేడవుతున్న నిఫ్టి

ఓపెనింగ్‌లో 17781ని తాకినా… ఇపుడు నిఫ్టి 17,745 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 34 పాయింట్లు నష్టపోయింది. వీక్లీ డెరివేటివ్స్‌ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నా… నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి మాత్రం 0.33 శాతం. నిఫ్టి నెక్ట్స్‌0.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఆర్థిక ఫలితాలు బాగుండటంతో టాటా కన్జూమర్‌ 3 శాతం లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో హెచ్‌డీఎఫ్‌సీ రెండు శాతం నష్టంతో ఉంది. అలాగే మిడ్‌ క్యాప్‌ నిఫ్టి జీ ఎంటర్‌టైన్మెంట్‌ 2.4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టికి 17700 దిగువన మద్దతు అందే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు.