For Money

Business News

వేదాంతలో మాతృసంస్థ విలీనం?

భారీగా నగదు నిల్వలు ఉన్న భారత్‌ యూనిట్‌లో నష్టాల్లో ఉన్న మాతృ సంస్థను విలీనం చేసే అంశాన్ని వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ యోచిస్తున్నారు. ఈ విషయాన్ని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక పేర్కొంది. భారత కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో మాతృసంస్థ వేదాంత రీసోర్సస్‌కు 70 శాతం వాటా ఉంది. మెటల్స్‌ ధరలు గణనీయంగా పెరగడంతో వేదాంత లిమిటెడ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ భారీగా పెరిగి 170 కోట్ల డాలర్లకు చేరింది. అయితే వేదాంత కంపెనీ మాత్రం ఈ వార్తను ఖండించింది.