For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా… ఫ్యూచర్స్‌ రెడ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నానమని ఫెడ్‌ రిజర్వ్‌ సభ్యులు ఇవాళ పునరుద్ఘాటించడంతో మార్కెట్‌లో మళ్ళీ ఒత్తిడి కన్పిస్తోంది. అమెరికా ఉత్సాహం ఆసియాలో కన్పించడం లేదు. ఈవారమంతా చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు సెలవు. తెరచి ఉన్న జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. న్యూజిల్యాండ్‌ సూచీ కూడా అదే స్థాయి నష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 20 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.