ఫేస్బుక్ షాక్… ఆదుకున్న గూగుల్
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. వాస్తవానికి రాత్రి నాస్డాక్కు ఫేస్బుక్ (మెటా) నుంచి షాక్ తగిలింది. కంపెనీ గైడెన్స్ తగ్గించడంతో షేర్ 20 శాతం క్షీణించింది. దీంతో నాస్డాక్ 0.5 శాతం లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ మాత్రం 0.9 శాతం లాభంతో ముగిసింది. డౌజోన్స్ కూడా 0.63 శాతం లాభంతో క్లోజైంది. అయితే ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 96పైన ఉంటోంది. ఇక క్రూడ్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ 89 డాలర్లపైనే ఉంది. బులియన్ ధరల్లో పెద్ద మార్పు లేదు. ఔన్స్ బంగారం ధర 1808 డాలర్ల వద్ద కొనసాగుతోంది.