22-23FYలో బీపీసీఎల్ అమ్మకం
బీపీసీఎల్ ప్రైవేటీకరణ వచ్చే ఆర్థిక సంవత్సరాని (2022 23)కి వాయిదా పడింది. డిసెంబరు త్రైమాసికంలో సంస్థ కోసం ఒక్క బిడ్డర్ కూడా రాలేదని బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వీఆర్‌కె గుప్తా పేర్కొన్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ ప్రైవేటీకరణ లేనట్లే. బీపీసీఎల్‌లో తనకు ఉన్న 52.98 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటి వరకు మూడు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) చేశాయి. వేదాంతా గ్రూప్, అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థకు చెందిన థింక్ గ్యాస్ ఉన్నాయి. బిడ్స్ చాలా తక్కువ రావడంతో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఇతర కంపెనీల నుంచి బిడ్స్ వస్తాయేమోనని ప్రభుత్వం ఎదురు చూస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీపీసీఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియ స్పీడు అందుకోవచ్చని భావిస్తున్నారు.