For Money

Business News

వేదాంత్ ఫ్యాషన్స్ ఇష్యూ 4న

మాన్యవర్ బ్రాండ్ దుస్తులను విక్రయించే వేదాంత్ ఫ్యాషన్స్ పబ్లిక్‌ ఇష్యూ ఫిబ్రవరి 4న ప్రారంభం కానుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ .824- రూ. 866గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.3149 కోట్లను ఈ ఇష్యూ ద్వారా కంపెనీ సమీకరించే అవకాశం ఉంది. యాంకర్ మదుపర్లకు బిడ్డింగ్ ఫిబ్రవరి 3న ప్రారంభం కానుంది. మొత్తం ఇష్యూ పరిమాణంలో సగం క్యూఐబీలకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేర మదుపర్లకు కేటాయించారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లాట్‌లో17 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఇది పూర్తిగా ఆఫర్ ఆఫర్ సేల్ (ఓఎఫ్ఎస్). అంటే కొత్త ఈక్విటీ జారీ ఉండదు. ఇపుడున్న యజమానులు తమ వాటాను అమ్ముకోవడానికి ఈ పబ్లిక్‌ ఆఫర్‌ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇష్యూ వల్ల కంపెనీకి పైసా కూడా రాదు. అంతా ప్రమోటర్‌ ఇన్వెస్టర్లకు వెళుతుంది.