పీఎన్‌బీ లాభం రూ.1127 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( పీఎన్‌బీ) నికరలాభం రూ .1126.78 కోట్లకు చేరింది.అంతక్రితం ఏడాది ఇదేకాల లాభం రూ.506.03 కోట్లలు. దాదాపు వంద శాతం కన్నా అధికంగా నికర లాభం పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,298.53 కోట్ల నుంచి రూ .22.026.02 కోట్లకు తగ్గడం విశేషం. నికర వడ్డీ ఆదాయం రూ.7803 కోట్ల నుంచి రూ.8345 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు 12.99 శాతం నుంచి 12.88 శాతానికి తగ్గితే , నికర ఎన్పీఏలు 4.03 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగాయి. అయితే విలువ పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏ రూ.94,479 కోట్ల నుంచి రూ.97,258 కోట్లకు, నికర ఎన్టీపీఏలు రూ .26,598.13 కోట్ల నుంచి రూ.33,878.56 కోట్లకు చేరాయి. కేటాయింపులు రూ .5,175.99 కోట్ల నుంచి రూ.3,353.55 కోట్లకు తగ్గాయి.