For Money

Business News

బడ్జెట్‌: హల్వా బదులు స్వీట్లు పంచారు

ప్రతి సంవత్సరం బడ్జెట్‌ తయారీ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హల్వా కార్యక్రమం జరిగితే. బడ్జెట్‌ తయారీలో పాల్గొనే ఉద్యోగులతో పాటు ఆర్థిక మంత్రి కూడా ఈ హల్వా కార్యక్రమంలో పాల్గొనేవారు. హల్వా తయారు చేసే ప్రాంతం ఈసారి కరోనా ఆంక్షలు ఉన్నందున ‘లాక్‌ ఇన్‌’లో ఉన్న ఉద్యోగులకు ఈసారి స్వీట్లు పంచారు. ప్రతి ఏడాది బడ్జెట్‌ తయారు చేసే ఉద్యోగులను నార్త్‌ బ్లాక్‌లో ‘లాక్‌ ఇన్‌’లో ఉంచుతారు. అంటే బడ్జెట్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు బంధు మిత్రులతో కలవకుండా నార్త్‌ బ్లాక్‌లోనే ఉంచుతారు. దీన్ని లాక్‌ ఇన్‌లో ఉంచడం అంటారు. ఈ సారి బడ్జెట్‌ను ప్రింట్‌ చేయడం లేదు. ఎలక్ర్టానిక్‌ బడ్జెట్‌ను పార్లమెంటు సభ్యులకు అందజేస్తారు. అలాగే బడ్జెట్‌ కోసం యాప్‌ కూడా అభివృద్ధి చేశారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ ఫామ్‌లలో ఇంగ్లిషు, హిందీ భాషల్లో ఈ యాప్‌ను తయారు చేశారు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరవాత బడ్జెట్‌ కాపీలను యాప్‌లో చూసుకోవచ్చు.