కోలుకున్నా… భారీ నష్టాల్లోనే…
మార్చిలో వడ్డీ రేట్లను పెంచాలని ఫెడ్ నిర్ణయంతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మన మార్కెట్లు కూడా మిడ్ సెషన్ వరకు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టి 16866 పాయింట్లను తాకింది. మిడ్ సెషన్లో మొదలైన యూరో మార్కెట్లలో నష్టాలు పెద్ద గా లేకపోవడం, అనేక మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడ్ కావడంతో మన మార్కెట్లు కోలుకున్నాయి. అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్ కూడా నష్టాల నుంచి తేరుకోవడంతో నిఫ్టి 17,177 పాయింట్ల వరకు కోలుకుంది.యఅఇనా క్లోజింగ్‌లో ఒత్తిడి కారణంగా 17085 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 192 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిజానికి బ్యాంక్ నిఫ్టి లాభాల్లో ముగిసింది.కాని మిడ్ క్యాప్‌తో పాటు నిఫ్టి నెక్ట్స్లు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. నష్టాల్లో ఐటీ షేర్లు ముందున్నాయి. ఇక నిఫ్టి గెయినర్స్‌లో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ముందున్నాయి. చక్కటి ఫలితాలు ప్రకటించిన కెనరా బ్యాంక్ 8 శాతం లాభంతో ముగిసింది.