For Money

Business News

బీ రెడీ… ఓపెనింగ్‌లోనే కుప్పకూలనున్న నిఫ్టి

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని సూచీలు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ 1.25 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే అన్ని ప్రధాన మార్కెట్లు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 3 శాతం నష్టపోయింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, హాంగ్‌సెంగ్‌ సూచీలు రెండు శాతంపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. కోప్సి కూడా 3 శాతం దాకా నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 400 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిన్నటి హాలిడే నష్టాలతో అడ్జస్ట్‌ చేసినా… నిఫ్టి 350 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నట్లు లెక్క. చూస్తుంటే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 2 శాతంపైగా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ మన మార్కెట్‌లో వీక్లీ, మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉంది. కాబట్టి నిఫ్టి భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.