ఫెడ్ నిర్ణయంతో వాల్‌స్ట్రీట్ ఢమాల్
మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడలర్ రిజర్వ్ స్పష్టం చేయడంతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిన్న ఉదయం నుంచి రెండు శాతంపైగా లాభంతో ట్రేడైన వాల్‌స్ట్రీ చివరికి మొత్తం లాభాలను పోగొట్టుకుంది. నాస్డాక్ జీరో లాభాలతో క్లోజ్ కాగా… డౌజోన్స్, ఎస్ అండ్పీ స్వల్ప నష్టంతో ముగిశాయి. షేర్ మార్కెట్ ట్రేడింగ్ అవుతుండగా ఫెడ్ నుంచి అప్డేట్ వచ్చింది. దీంతో మార్కెట్ లాభాలన్నీ కరిగిపోయాయి. మార్కెట్ తరవాత ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడారు. దీంతో అమెరికా ఫ్యూచర్స్ ఒక శాతం పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఫెడ్ నిర్ణయం తరవాత బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ 1.8709 శాతానికి చేరాయి.