ఎస్‌బీఐ కార్డ్ లాభం జూమ్
డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 84 శాతం పెరిగి రూ. 386 కోట్లకు చేరింది. కార్డుల వినియోగం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం, ఇతర ఆదాయం పెరగడం వల్ల ఈ నికరలాభం సాధ్యమైందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 210 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కంపెనీ మొత్తం ఆదాయం 24 శాతం పెరిగి రూ. 3,140 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ఎన్‌పీఏలు 4.51 శాతం నుంచి 2.40 శాతానికి క్షీణించినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నికర ఎన్‌పీఏలు సైతం 1.60 శాతం నుంచి 0.83 శాతానికి తగ్గాయి.