For Money

Business News

ఫ్యాబ్‌ ఇండియా ఐపీఓ

లైఫ్‌స్టైల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది. ఐపీఓలో భాగంగా చేతివృత్తుదారులు, రైతులకు 7 లక్షల వరకూ షేర్లను బహుమతిగా ఇవ్వాలని కంపెనీ ప్రమోటర్లు యోచిస్తున్నారు. రూ. 500 కోట్ల విలువైన షేర్లను తాజా ఇష్యూ ద్వారా.. మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాను అమ్మడం ద్వారా సమీకరిస్తారు. కంపెనీ ఇప్పటికీ సెబీకి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ (DRHP)ని దాఖలు చేసింది. 2,50,50,543 షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.
ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) విలువ దాదాపు రూ.4,000 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
షేర్ల తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం కంపెనీ యొక్క NCDల (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) తిరిగి చెల్లించడానికి, కొంత మేర రుణాలు చెల్లించడానికి వినియోగిస్తారు.