సూచీ సుమారుగా… షేర్లు భారీగా పతనం
పైకి నిఫ్టి కేవలం 139 పాయింట్లు క్షీణించినట్లు కన్పిస్తున్నా… షేర్లలో మాత్రం భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిన్న, ఇవాళ నిఫ్టిలో వచ్చిన అమ్మకాలు జోరు ఏ స్థాయిలో ఉందంటే…దేశీయ ఆర్థిక సంస్థలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి.మిడ్ సెషన్లో కోలుకున్న నిఫ్టి సరిగ్గా మూడు గంటలకు ముందు.. అంటే స్వ్కేర్ ఆఫ్ ప్రారంభానికి ముందు కుప్పకూలింది. మార్కెట్కు ఎంతో కీలకమైన 17500 స్థాయిని బ్రేక్ చేసి .. 17485ని టచ్ చేసింది. స్వ్కేర్ ఆఫ్ సమయంలో కోలుకుని 17617 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 140 పాయింట్లు క్షీణించింది. 35 షేర్లు నష్టాల్లో క్లోజ్ కాగా, 15 షేర్లు లాభాల్లో ముగిశాయి.