For Money

Business News

17,550ని తాకిన నిఫ్టి

రోల్‌ కోస్టర్‌ రైడ్‌. నిఫ్టి ఓపెనింగ్‌ ట్రేడ్‌ అలాగే ఉంది. ఓపెనింగ్‌లోనే 190 పాయింట్లు పతనమైంది నిఫ్టి. 17,637కి చేరిన నిఫ్టి… కొన్ని సెకన్లలోనే 17,550ని తాకింది. తరవాత కోలుకున్నట్లు కన్పించినా… వెంటనే ఒత్తిడి వస్తోంది. నిఫ్టి ఇపుడు 203 పాయింట్ల నష్టంతో 17,553 వద్ద ట్రేడవుతోంది. నిన్న టాప్‌ లూజర్‌గా ఉన్న బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఇవాళ కూడా టాప్‌ లూజర్‌గా ఉంది. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అవి కూడా నామ మాత్రపు లాభాలే. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి, నిఫ్టి ఫైనాన్షియల్‌ కూడా ఒక శాతం నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది.