NIFTY TRADE: 17400 దాకా?
ఒకటే మంత్ర. పెరిగినపుడల్లా నిఫ్టిని అమ్మండి..అని అంటున్నారు సీఎన్‌బీసీ టీవీ 18 టెక్నికల్ అనలిస్ట్ వీరేందర్ కుమార్. 17820 స్టాప్‌లాస్‌తో అమ్మమని ఆయన సలహా ఇస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాల ఒత్తిడిని పెంచతున్నారు. నిన్న క్యాష్ మార్కెట్లో రూ.4,680 కోట్లను అమ్మారు.దేశీయ ఆర్థిక సంస్థలు రూ. 769 కోట్లకు మించి కొనుగోలు చేయలేకపోయాయి. ఇండెక్స్ ఫ్యూచర్లో రూ. 2103 కోట్లు, స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ. 2464 కోట్లు అమ్మారు. వీరి కొనుగోళ్ళు మొత్తం ఆప్షన్స్‌లో ఉన్నాయి. ఈ విభాగంలో వీటి నికర కొనుగోళ్ళు రూ. 7,075 కోట్లు దాటాయి. ఇప్పటి వరకు లాంగ్ పొజిషన్స్‌ను అన్వైండ్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు… ఇపుడు షార్ట్ కూడా చేస్తున్నారని వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టికి మద్దతు 17690 ఏలదా 17630 వద్ద లభించే అవకాశముందని అంటున్నారు. ఒత్తిడి తీవ్రంగా ఉంటే 17,582 లేదా 17,531ని తాకే అవకాశముందని ఆయన అంటున్నారు. పొజిషనల్ ట్రేడర్స్ 17500 లేదా 17400 కోసం వెయిట్ చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.