NIFTY TRADE: టెక్నికల్‌గా బలహీనం
నిఫ్టి 18000 దాటినా ముందుకు సాగడం కష్టంగా కన్పిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కొంటున్న దేశీయ ఆర్థిక సంస్థలు కూడా ఇపుడు అమ్మడం ప్రారంభించాయి. దీంతో కొనేవారు కన్పించడం లేదు. నిఫ్టి టెక్నికల్‌గా బలహీనంగా కన్పిస్తోందని వీరేందర్ అంటున్నారు. ఒకవేళ నిఫ్టి 18000 దాటినా వెంటనే ఒత్తిడి వస్తుందని, ఒకవేళ నిఫ్టి ఇంకా ముందుకు సాగినా 18073ని చేరడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పడితే 17904 లేదా 17844 వద్ద మద్దతు లభించవచ్చని ఆయన పేర్కొన్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=KHYFN2E-dH0