For Money

Business News

NIFTY TODAY: 18072 కీలకం

సింగపూర్‌ నిఫ్టి మాదిరిగానే నిఫ్టి ప్రారంభం అవుతుందేమో చూడాలి. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. కాని మన మార్కెట్లలో ఆ ఉత్సహం కన్పించడం లేదు. అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ఉండటం ఒక కారణం కాగా, రెండో కారణం కంపెనీల ఫలితాలు నిరుత్సాహంగా ఉండటం. ఈ నేపథ్యంలో నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చినా 18100ని దాటుతుందా అన్న అనుమానం కల్గుతోంది. అమెరికా, బ్రిటన్‌లో ఈల్డ్స్‌ బాగా పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం 30 ఏళ్ళ గరిష్ఠానికి చేరాయి. ఇక విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. నిన్న క్యాష్‌ మార్కెట్‌లోనే విదేశీ ఇన్వెస్టర్లు రూ.2705 కోట్ల నికర అమ్మకాలు చేశారు. దేశీయ ఆర్థిక సంస్థలు కూడా రూ.195 కోట్లు మేర నిన్న అమ్మాయి. అన్ని రకాల సూచీలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌ లెవల్స్‌ ….

మార్కెట్‌కు కీలక స్థాయి 17984
తొలి ప్రతిఘటన … 18023
రెండో ప్రతిఘటన…18050
అప్‌ బ్రేకౌట్‌… 18,090
తొలి మద్దతు… 17854
రెండో మద్దతు… 17,827
డౌన్‌ బ్రేకౌట్‌… 17,787

కంపెనీల ఫలితాలు బాగా లేవు. కాబట్టి పొజిషనల్‌ ట్రేడర్స్‌ జాగ్రత్తగా ఉండాలి.