దుమ్ము రేపిన బజాజ్ ఫైనాన్స్
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో తనకెవరూ సాటిరారని బజాజ్ ఫైనాన్స్ నిరూపించుకుంది. ఇవాళ కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 6000 నికర ఆదాయంపై రూ. 2125 కోట్ల నికర లాభాన్నిప్రకటించింది. సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించిన పోల్‌లో కంపెనీరూ. 4910 కోట్ల నికర ఆదాయంపై రూ. 2074 కోట్ల నికర ఆదాయం ఆర్జింస్తుందని అంచనా వేశారు. అదే గత ఏడాదితో పోలిస్తే కంపెనీ నికర ఆదాయం 39.7 శాతం పెరగ్గా, నికర లాభం 85.4 శాతం పెరిగింది. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 4296 కోట్ల ఆదాయంపై రూ. 1146 కోట్ల నికర లాభం ఆర్జించింది.