For Money

Business News

NIFTY TODAY: మిడ్‌ సెషన్‌ కీలకం

ఇవాళ ఏ పొజిషన్స్‌ తీసుకున్నా మిడ్‌ సెషన్‌ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అమెరికా, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో యూరో మార్కెట్‌లో ఎలా స్పందిస్తుందనేది కీలకం. ముఖ్యంగా మన ఐటీ కంపెనీల ఫలితాలు అంతంత మాత్రమే ఉండటం, అమెరికాలో ఐటీ షేర్లలో అమ్మకాలతో పాటు డాలర్‌ పతనం.. మన దేశ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపనుంది. ఇక డే ట్రేడింగ్‌ విషయానికొస్తే నిఫ్టి క్రితం ముగింపు 18257. చూస్తుంటే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 18200 స్థాయిని కోల్పోయే అవకాశముంది. దిగువ స్థాయిలో కొనడం కన్నా… వీలైతే అధిక స్థాయిలో అమ్మడం బెటర్‌. నిఫ్టికి ఇవాళ్టికి 18,230 అంత్యంత కీలకం. ఈ స్థాయి దిగువన 18180 వరకు ఎలాంటి మద్దతు లేదు. ఈ స్థాయిని కోల్పోతే మార్కెట్‌ భారీ కరెక్షన్‌ను సిద్ధమైనట్లే. 18150 దిగువన 18090, 18055 వరకు మద్దతు లేదు. ఒకవేళ మార్కెట్‌ లాభాల్లోకి వస్తే… అమ్మడానికి ఛాన్స్‌గా భావింవచ్చు. టెక్నికల్‌గా నిఫ్టి 18300 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఉంది.