ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీల పెంపు
క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. సవరించిన చార్జీలు వచ్చే నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే క్రెడిట్ కార్డు ఆలస్య ఫీజులను కూడా పెంచింది.
క్రెడిట్ కార్డుపై క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే 2.50 శాతం ట్రాన్సాక్షన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. లేదా కనీస మొత్తం రూ. 500 ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డు ఉపయోగించి మీరు రూ. 1000 అడ్వాన్స్ తీసుకున్నా రూ. 500 ఫీజు అన్నమాట. అలాగే చెక్ రిటర్న్ అయితే …ఎంత మొత్తం కట్టాల్సి ఉందో దానిపై 2 శాతం చార్జిని కట్టాల్సి ఉంటుంది. ప్రతి నెలా చెల్లింపుల కోసం ఆటో డెబిట్ కింద… ముందే చెక్లు ఇస్తుంటాం. అది కూడా బౌన్స్ అయితే రెండు శాతం చార్జి కట్టాలి. కనీస చార్జీ రూ. 500.
లేట్ పేమెంట్ బాదుడు
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించిన పక్షంలో… జరిమానా కూడా భారీగా విధించనుంది ఐసీఐసీఐ బ్యాంక్.
రూ. 100 లోపు చెల్లించాల్సి ఉంటే చార్జి లేదు
రూ.100 నుండి రూ. 500 వరకు చార్జి రూ. 100
రూ.501 నుంచి రూ. 5000కు రూ. 500
రూ. 5001నుంచి రూ. 10,000కు రూ. 750
రూ.1 0,001 నుంచి రూ. 25,000 వరకు రూ. 900,
రూ. 25,001 నుంచి రూ. 50,000వరకు రూ. 1000
రూ. 50 వేలు దాటితే రూ. 1,200
ఈ ఛార్జీలకు మరో రూ. 50తోపాటు జీఎస్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.