పబ్లిక్ ఇష్యూకు శ్రేష్ఠ నేచురల్
హైదరాబాద్‌కు చెందిన శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ‘24 మంత్ర’ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ ఆర్గానిక్ ఉత్పత్తులను ఈ కంపెనీ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఆఫర్ కోసం సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.50 కోట్ల వరకూ సమీకరణకు కొత్తగా షేర్లను జారీ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇపుడున్న ఇన్వెస్టర్లు 70.3 లక్షల షేర్లను విక్రయిస్తారు. ఇపుడు పీపుల్ క్యాపిటల్ ఫండ్ III ఎల్‌ఎల్‌సీ, బయో ఫండ్‌తో సహా మరికొందరు తమ వాటాలను విక్రయిస్తారు. తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ కోసం, రుణాలను తిరిగి చెల్లించడానికి వినియోగిస్తారు.2004లో ఈ కంపెనీని శీలం రాజశేఖర్ రెడ్డి, శీలం రేణుక, నారాయణన్ బాలసుబ్రమణ్యం నెలకొల్పారు. వీరికి 23.63 శాతం వాటా ఉంది. మిగిలినది ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 312 కోట్ల టర్నోవర్‌పై రూ. 10.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.