ఏడాదిలో రూ. 8.90 నుంచి రూ. 290
టాటా టెలి సర్వీసెస్ ఏడాదిలో ఏకంగా 3000 శాతం పైగా పెరిగింది. ఇవాళ కూడా ఈ షేర్ 5 శాతం పెరిగి రూ.290 వద్ద ముగిసింది. ఏడాది క్రితం అంటే 2021 జనవరి 1న ఈ షేర్ ధర రూ. 8.90. అక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది. ఇవాళ తను చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లించకుండా సమానమైన మొత్తానికి షేర్లను వోడాఫోన్ ఐడియా కేంద్ర ప్రభుత్వానికి కేటాయించింది. అలాగే టాటా టెలి కూడా బకాయిలపై చెల్లించాల్సిన వడ్డీ రూ.850 కోట్లు. దీనికి సమానమై వాటా 9.5 శాతం ప్రభుత్వానికి ఇవ్వడానికి కంపెనీ సిద్ధమైంది. నిజానికి ధర నిర్ణయించే సమయంలో గత ఏడాది ఆగస్టు 14వ తేదీ నాటి ధరను సగటు రేటుగా కంపెనీ ప్రభుత్వానికి తెలిపింది. ఆ లెక్కన ఇదే ధరకు 9.5 శాతం ఈక్విటీకి సమాన షేర్లను ప్రభుత్వానికి కేటాయిచంనుంది. కంపెనీ నిర్ణయం షేర్ మార్కెట్ ట్రేడింగ్ పూర్తయ్యాక వెలువడింది. మరి కంపెనీ నిర్ణయానికి స్పందిస్తూ ఈ షేర్ రేపు పడుతుందా లేదా అని ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.