For Money

Business News

ఐటీ రిటర్న్‌లు: పొడిగింపు అందరికీ కాదు

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి పొడిగింపు కేవలం ఆడిట్‌ అకౌంట్స్‌ సమర్పించేవారికి మాత్రమేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. ఆడిట్‌ అకౌంట్స్‌ సమర్పించేవారికి రిటర్న్‌లు దాఖలు చేయడానికి గడువును మార్చి 31 వరకు పొడిగించారు. సాధారణంగా వ్యక్తులు ఆడిట్‌ రిటర్న్‌లను దాఖలు చేయరు. ఐటీఆర్‌ -1, ఐటీఆర్‌ -2. ఐటీఆర్‌ -4 కింద ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు దాఖలు చేసేవారికి గడువు గత ఏడాది డిసెంబర్‌ 31తోనే ముగిసింది.కరోనా ఉధృతి దృష్ట్యా 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆడిట్‌ అకౌంట్స్‌ దాఖలు చేసే వారికి మాత్రమే మార్చి 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది.