3 రియల్ ఎస్టేట్ కంపెనీలు… రూ. 800 కోట్ల నల్లధనం
ఈ నెల 5వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప, బళ్ళారి, నంద్యాల తదితర ప్రాంతాల్లో మూడు కంపెనీలకు చెందిన స్థావరాలపై ఐటీ దాడులు జరిగాయని, ఈ దాడుల్లో ఖాతాల్లో చూపని రూ. 800 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయిని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. నవ్య డెవలపర్స్, రాగ మయూరి ఇన్ఫ్రాతో పాటు స్కంధాన్షి ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కంపెనీల నుంచి రూ. 1.64 కోట్ల లెక్కల్లో చూపని నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మూడు కంపెనీల వద్ద చేతిరాతతో ఉన్న పుస్తకాల్లో, ఒప్పందాలతో పాటు ఎలక్ర్టానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అనేక రహస్య దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలు పత్ర్యేక సాఫ్ట్వేర్ను వాడినట్లు పేర్కొంది. లావాదేవీలు పూర్తయ్యాక ఆటోమేటిక్ డేటా మాయమయ్యేలా ఆధునాత సాఫ్ట్వేర్ను ఈ కంపెనీలు వాడినట్లు ఐటీ విభాగం పేర్కొంది. భూముల వాస్తవ విలువకు మించిన మొత్తాన్ని నగదు రూపంలో వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఇలా అనధికారికంగా సంపాదించిన మొత్తాన్ని మళ్ళీ భూములు కొనుగోలు చేయడానికి, ఇతర ఖర్చుల కింద చూపారని పేర్కొంది.