డన్‌జోలో వాటా కొన్న రిలయన్స్
బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ కంపెనీ డన్‌జోలో రిలయన్స్ రీటైల్ 25.8 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని కోసం 20 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థతో పాటు లైట్ బాక్స్, లైట్‌రాక్, 3ఎల్ క్యాపిటల్, ఆల్టేరియా క్యాపిటల్ కూడా ఈ కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టాయి. మైక్రో వేర్‌హౌస్‌ల ద్వారా త్వరగా డెలివరీ చేసే సర్వీసులు అందిస్తున్న డన్‌జో మరింత విస్తరణ కోసం ఈ నిధులను వెచ్చిస్తారని రిలయన్స్ రీటైల్ పేర్కొంది. బీటూబీ వర్టికల్‌లోకి డన్‌జో కంపెనీ విస్తరించే అవకాశముంది.