భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభం
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17,797కి చేరినా కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 17737 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 145 పాయింట్ల నష్టంతో 17780 వద్ద ఇపుడు ట్రేడవుతోంది. డాలర్ బలపడటంతో ఫార్మా షేర్లకు కాస్త మద్దతు లభిస్తోంది.దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్, ఎన్బీఎఫ్సీ షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది. వడ్డీ రేట్ల పెంపు తొందర్లోనే మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఆటో షేర్లు కూడా ఇవాళ నష్టాల్లో ముందున్నాయి. ఐటీ షేర్లలో ఒత్తిడి ఉన్నా… భారీ నష్టాలు మాత్రంలేవు. హెచ్డీఎఫ్సీ జోడీ ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో 42 షేర్లు నష్టాల్లోఉన్నాయి. మిడ్ క్యాప్‌లో చాలా రోజుల తరవాత బాటా నష్టాల షేర్లలో ముందుంది.