కోవిడ్ మాత్రలు ప్రమాదకరం… వాడొద్దు… ICMR
కోవిడ్ యాంటీ-వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ వల్ల వచ్చే వివిధ ఆరోగ్య సమస్యల దృష్ట్యా సదరు టాబ్లెట్లను వాడొద్దని ఇండియన్ కౌన్సఇల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి) (ICMR -Indian Council of Medical Research) హెచ్చరించింది. మెర్క్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వైరస్ నిరోధక మాత్రను జాతీయ చికిత్స ప్రోటోకాల్‌లో చేర్చడం లేదని ICMR చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ వ్యాధికి మోల్నుపిరావిర్‌ను అమమోదం ఆమోదించింది. అయితే ఇది టెరాటోజెనిసిటీ, మ్యూటాజెనిసిటీ వంటి సమస్యలకు కారణమవడమేగాక… కార్టలేజ్ డ్యామేజ్, కండరాలకు కూడా హాని కలిగిస్తుందని నిపుణులు గుర్తించారు. ఒక రోగి మోల్నుపిరావిర్‌ను తీసుకుంటే మూడు నెలల పాటు గర్భనిరోధక మాత్రలు వాడాల్సి ఉంటుంది. లేదంటే లేదంటే పుట్టే బిడ్డకు ప్రమాదం ICMR అంటోంది. ఈ నేపథ్యంలోనే దీనిని చికిత్స ప్రొటోకాల్ నుంచి తీసేసినట్టు బలరాం భార్గవ ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటన్ వంటి దేశాలు కూడా దీనిని అనుమతించలేదన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.
ఫార్మా కంపెనీలకు షాక్
ICMR నిర్ణయం ఫార్మా కంపెనీలకు షాక్ అని చెప్పొచ్చు. మెర్క్ ట్యాబ్లెట్లను భారత్ తయారు చేసి, అమ్మేందుకు 13 కంపెనీలు అనుమతి పొందాయి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ‘మోల్ఫ్యూ’ పేరుతో వచ్చే వారం నుంచి ఈ మందు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. మోల్‌ఫ్లూ మోల్నుపిరావిర్ అని పిలువబడే మెర్క్ ఔషధం జెనరిక్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది సంస్థ. దీని ధర ఒక్కో క్యాప్సూల్ రూ.35గా నిర్ణయించారు. ఒక్కో స్ట్రిప్‌కు 10 క్యాప్సూల్స్‌తో 5 రోజులలో 40 క్యాప్సూల్స్ మొత్తం కోర్సు రూ.1,400 ఖర్చు అవుతుంది. మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్‌ను తయారు చేసి అమ్మడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు గత వారం మాత్రమే అత్యవసర వినియోగ అనుమతి లభించింది.