For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌ భారీ జంప్‌

గత అక్టోబర్‌లో 85 డాలర్లపైకి చేరిన క్రూడ్‌ తరవాత క్షీణిస్తూ వచ్చింది. ఇపుడు మళ్ళీ ఆ స్థాయి వైపు దూసుకెళుతోంది. ఒకవైపు డాలర్‌ స్థిరంగా 96పైనే ఉన్నా…ఇవాళ క్రూడ్‌ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. ఆసియా దేశాలు కొనే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 78.58 డాలర్లకు చేరింది. ఒకవైపు ఒమైక్రాన్‌ కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దవుతున్నా …. క్రూడ్‌ ధరలు ఇలా పెరగడం మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌లో మెజారిటీ ఇన్వెస్టర్లు లాంగ్‌ పొజిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో క్రూడ్‌ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. భారత వంటి దేశాలకు ఇది పెద్ద తలనొప్పే మరి.