హెచ్‌పీ అధెసివ్స్‌కు 15 % లిస్టింగ్ లాభం
వివిధ రకాల అధెసివ్స్, సీలెంట్స్‌ను తయారు చేసే హెచ్‌పీ అధెసివ్స్ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఓపెనింగ్‌లోనే 14.96 శాతం లాభం లభించింది. ఇష్యూ ధర రూ.274 కాగా ఎక్స్ఛేంజీలో రూ.315 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేరు అప్పర్ సర్క్యూట్‌ని తాకి రూ.330.75లకు చేరింది. రూ.126 కోట్ల సమీకరణకు వచ్చిన ఈ ఐపీఓ 17న ముగిసింది. ఇష్యూ 20.96 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. పీవీసీ, సీపీవీసీ, యూపీవీసీ సాల్వెంట్ సిమెంట్, సింథటిక్ రబ్బర్ అధెసివ్స్, సిలికోన్ సీలెంట్, అక్రైలిక్ సీలెంట్, గ్యాస్కెట్ షెల్లాక్ వంటి ఉత్పత్తులను ఇది తయారు చేస్తుంటుంది.