నిఫ్టికి బ్యాంకుల అండ
ఉదయం బ్యాంక్ నిఫ్టిలోని అన్ని షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కేవలం పది నిమిషాల్లోనే 200 పాయింట్లు క్షీణించిన నిఫ్టి గంటలోనే లాభాల్లో వచ్చింది. అప్పటి నుంచి క్రమంగా బలపడుతూ వచ్చింది. మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్లోఉండటంతో నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం 16,833కి చేరిన నిఫ్టి క్లోజింగ్ కల్లా 17112 పాయింట్లను తాకి 17086 వద్ద ముగిసింది. ఆల్గో ట్రేడింగ్ లెవల్స్‌ను పక్కాగా తాకింది. దీంతో డే ట్రేడేర్స్ ఇరువైపులా లాభం వచ్చింది. చాలా వరకు ప్రైవేట్ బ్యాంకులు కోలుకున్నా ఆర్బీఎల్ బ్యాంక్ మాత్రం18 శాతంపైగా నష్టంతో ముగిసింది.