NIFTY TODAY: పెరిగితే అమ్మండి
ప్రపంచ మార్కెట్లు హాలిడే మూడ్‌లో ఉన్నాయి. చాలా మార్కెట్లు పనిచేయడం లేదు. పనిచేస్తున్నా ట్రేడింగ్ నామమాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 17,003. గత శుక్రవారం నిఫ్టి 16909ని తాకింది. టెక్నికల్‌గా కొనుగోలు మద్దతు మళ్ళీ అక్కడే ఉంది. నిఫ్టి ఆ స్థాయికి వస్తే 16,890 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి 17,023 దిగువకు వెళ్ళకుంటే గ్రీన్‌లోనే ఉంటుంది. కాని 17080 దాటేతే ఒత్తిడి వచ్చే అవకాశముంది. నిఫ్టి పెరిగితే అమ్మడం బెటర్. దిగువన కొనడమనేది ఇన్వెస్టర్ల రిస్క్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ కొన్నా స్టాప్‌లాస్ కచ్చితంగా పాటించండి. ముఖ్యంగా ఇవాళ బ్యాంక్ నిఫ్టిని బట్టి నిఫ్టి కదలాడే అవకాశముంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ వ్యవహారం చాలా కీలకంగా మారింది.