For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

ప్రపంచ మార్కెట్లు క్రిస్మస్‌ సెలవులు కారణంగా గత శుక్రవారం పనిచేయలేదు. ఇవాళ కూడా హాంగ్‌కాంగ్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి మార్కెట్లు పనిచేయడం లేదు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభనష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.