For Money

Business News

బంపర్‌ లాభంతో లిస్టయిన మెడ్‌ప్లస్‌

హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీ షేర్లు ఇవాళ 30 శాతంపైగా లాభంతో రూ. 1040 వద్ద లిస్టయ్యాయి. ఇపుడు 35 శాతం లాభంతో రూ. 1,070 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.796లకు ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ 52 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. దీంతో అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌కు భారీ ప్రీమియం లభించింది. 2015లో ప్రారంభమైన ఈ కంపెనీకి 150 నగరాల్లో 1300 రీటైల్‌ ఫార్మా స్టోర్లు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల క్లినికల్‌ లేబరొరేటరీలు కూడా ఉన్నాయి.