17,050పైన నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17050 స్థాయిని దాటింది. 17069ని తాకిన తరవాత 17035కు పడిండి. క్రితం ముగింపుతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో ఇపుడు 17045 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లకు భిన్నంగా అమెరికా మార్కెట్ల బాటలో నిఫ్టి పయనిస్తోంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటంతో నిఫ్టిలో హెచ్చతగ్గులకు ఆస్కారం ఉంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఇటీవల బాగా క్షీణించిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆకర్షణీయ లాభాలు గడించాయి. అన్ని సూచీలు 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో ఇపుడు 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. పోర్టులో చార్జీలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్ క్యాప్ షేర్లలో ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నిఫ్టి నెక్ట్స్‌లో జూబ్లియంట్ ఫుడ్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. నిన్న భారీగా క్షీణించిన బంధన్ బ్యాంక్ ఇవాళ 2 శాతం దాకా లాభాల్లో ట్రేడవుతోంది.