For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు బంపర్‌ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ ఏకంగా 2.5 శాతం లాభంతో క్లోజైంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.78 శాతం, డౌ జోన్స్‌ కూడా ఇదే స్థాయి లాభాలతో క్లోజయ్యాయి. అయితే ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మాత్రం డల్‌గా ఉన్నాయి. గ్రీన్‌లో ఉన్నా లాభాలు నామ మాత్రంగా ఉన్నాయి. నిజానికి నిక్కీ, చైనా మార్కట్లు నామ మాత్రపు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ సూచీ కూడా కేవలం 0.22 శాతం వాటాతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి కూడా నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.