స్నాప్‌డీల్ ఐపీఓ వచ్చేస్తోంది….
దేశంలో అనేక కంపెనీలకు సాఫ్ట్‌బ్యాంక్ పెట్లుబడి అందించి అండగా నిలిచింది. ఇపుడు మార్కెట్‌లో లిక్విడిటీ బాగా ఉండటంతో ఒక్కో కంపెనీ నుంచి తన వాటాను తగ్గించుకుంటోంది. పే టీఎం, జొమాటో, నైకా తరవాత ఇపుడు స్నాప్ డీల్ కంపెనీలో తన వాటాను తగ్గించుకుంటోంది. ఈ మేరకు స్నాప్‌డీల్ పబ్లిక్ ఇష్యూ రాబోతోంది. ఇష్యూ ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. అనుమతి వచ్చిన వెంటనే పబ్లిక్ ఆఫర్ చేయనుంది. 2010లో ఈ కంపెనీ ప్రారంభమైంది. పబ్లిక్ ఆఫర్‌లో ప్రమోటర్లు తమ వాటాను అమ్మడం లేదు. సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు ఫాక్స్‌కాన్, సేక్వియా క్యాపిటల్ వంటి కంపెనీలు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్ముతాయి. రూ. 1250 కోట్ల విలువైన తాజా ఈక్విటీని కంపెనీ ఆఫర్ చేస్తుంది. అలాగే తమ దగ్గర ఉన్న షేర్లలో 3.08 కోట్ల షేర్లను ఇతర సంస్థలు అమ్ముతాయి.