ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిన నిఫ్టి
ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి పది శాతం పడింది. ఈ స్థాయిలో కన్సాలిడేట్ అవుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు ఇవాళ నిఫ్టి చుక్కులు చూపించింది. గత శుక్రవారం డిసెంబర్ నెల 17,200 కాల్ రైటింగ్ భారీగా సాగింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఆప్షన్స్ కౌంటర్లో రూ. 4000 కోట్లకుపైగా ట్రేడ్ చేశారు. వీటిలో కాల్ కాంట్రాక్ట్‌లను రైటింగ్ అధికంగా ఉంది.16500 పుట్ కొనుగోళ్ళు జరుగుతున్నపుడే ఎఫ్ అండ్ ఓ నిపుణులు హెచ్చరించారు. ఇవాళ ఉదయం నుంచి సీఎన్‌బీసీ టీవీ 18 ప్రేక్షకులకు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని హెచ్చరించారు. నిఫ్టి ఒకవేళ పెరిగితే అమ్మమని సలహా ఇచ్చారు. దాదాపు వంద పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా… కొనుగోలు చేయొద్దని, నిఫ్టి బేర్ గుప్పెట్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఎఫ్ అండ్ ఓ విభాగాన్ని బాగా ట్రాక్ చేసేవారికి ఈ వ్యూహం ముందే గ్రహించారు. నిఫ్టి 17400 ప్రాంతంలో ట్రేడవుతున్న సమయంలోనే 16500 పుట్స్‌లో ఓపెన్ ఇంటరెస్ట్ పెరుగుతుండటాన్ని చాలా మంది గమనించారు. గత కొన్ని నెలల నుంచి ఇన్వెస్టర్లు బై ఆన్ డిప్ ఫార్ములాను నమ్మారు. ఈసారి విదేశీ ఇన్వెస్టర్ల ట్రాప్‌ను గమనించలేకపోయారు. 17400 దిగువ పడినపుడు బై ఆన్ డిప్ పద్ధతిలోనే కొనుగోలు చేశారు. అపుడు జరిగిన కాల్ రైటింగ్‌కు చాలా మంది బలి అయ్యారు. 17200 కాల్‌ను రూ.64 వద్ద అమ్మిన ఎఫ్ఐఐలు ఇవాళ రూ. 10 వద్ద కొంటున్నారు. సేమ్ జనవరి నెల కాంట్రాక్ట్ రూ.172 నుంచి రూ. 63కు పడింది. ఆప్షన్స్ ట్రేడింగ్‌లో చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు దెబ్బతిన్నారు. నిఫ్టికన్నా దారుణంగా బ్యాంక్ నిఫ్టిలో చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోయారు. అమెరికా వడ్డీ రేట్లు తగ్గించినా… మన మార్కెట్‌కు పరవాలేదని మీడియాలో వచ్చిన వార్తలను నమ్మిన ఇన్వెస్టర్లు అడ్డంగా బుక్ అయిపోయారు. బ్యాంక్ నిఫ్టి ఇవాళ ఏకంగా 4 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టి ఈనెల కాంట్రాక్ట్ 35,000 కాల్ రూ.832 నుంచి రూ.138కి పడింది. రూ. 800పైన కాల్ రైటింగ్ చేసినవారికి ఇవాళ భారీ లాభాలు దక్కాయి.