16,750 దిగువకు నిఫ్టి
పతనంలో సింగపూర్ నిఫ్టికా బాప్ అన్నట్లు ఓపెనింగ్‌లోనే నిఫ్టి16750 దిగువకు పడి నిఫ్టి. నిఫ్టి 16824 వద్ద ఓపెనై… 16840ని తాకిన రెండు నిమిషాల్లోనే నిఫ్టి 16,747ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 235 పాయింట్లు నష్టపోయింది. గతవారం ప్రధాన మంత్రి మోడీ విదేశీ ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు. చర్చల గురించి ఎలాంటి వార్తలు రాకున్నా…బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. బ్యాంక్ నిఫ్టి కీలక స్థాయిలను కోల్పోయింది. 730 పాయింట్ల నష్టంతో 34,888 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక మార్కెట్‌కు వెన్నుముకగా ఉండే మిడ్‌క్యాప్ షేర్ల సూచీకూడా రెండు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి ప్రస్తుతం 237 పాయింట్ల నష్టంతో 16748 వద్ద ట్రేడవుతోంది. తాజా 100 చలన సగటుకు దిగువకు చేరింది. మరి కోలుకుంటుందేమో చూడాలి. ఇక నిఫ్టిలో 44 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఐటీ షేర్ల నుంచి కూడా మద్దతు లభించలేదు. అమెరికా ఫ్యూచర్స్ భారీనష్టాలు మార్కెట్‌ను కలవర పెడుతున్నాయి. మిడ్ సెషన్లో యూరో మార్కెట్లు ప్రారంభమయ్యే లోగా.. నిఫ్టి కోలుకుంటుందేమో చూడాలి.