For Money

Business News

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తగ్గింపు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ చందా ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ చందా నెలకు రూ.199 కాగా, రూ.149కు తగ్గించింది. బేసిక్‌ ప్లాన్‌ ధరను కూడా నెలకు రూ.499 నుంచి రూ.199కు తగ్గించారు. స్టాండర్డ్‌ ప్లాన్‌ను రూ.649 నుంచి రూ.499కి, ప్రీమియం ప్లాన్‌ను రూ.799 నుంచి రూ.649కి తగ్గించారు.