గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ
దాదాపు పదేళ్ళ నుంచి ఎలాంటి వృద్ధి లేఇ కమాడిటీ ఏదైనా ఉందంటే.. అది బులియన్. బంగారం, వెండి ధరలు పదేళ్ళ నుంచి స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు పెరగడం అటుంచి… ఒక శాతం వరకు తగ్గాయి కూడా. అయితే ఒమైక్రాన్ విస్తరిస్తుండటంతో జనం క్రమంగా బంగారంలో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. నవంబరులో బంగారం ఈటీఎ్‌ఫలు రూ.683 కోట్లు సమీకరించటమే ఇందుకు నిదర్శనం. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి సెప్టెంబరులో రూ.446 కోట్లు, అక్టోబరులో రూ.303 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ ఈటీఎ్‌ఫలు రూ.4,500 కోట్లు ఆకర్షించాయి. కాగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ అక్టోబరు చివరి నాటికి రూ. 17,320 కోట్లుండగా నవంబరు చివరికి రూ.18,104 కోట్లకు పెరిగాయి.స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి వైపు వెళ్ళేకొద్ది ఇన్వెస్టర్లు షేర్లలోని తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని బంగారం వైపు తరలించే అవకాశముంది.